Mokshagna: నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రం మొదలు కాకముందే… వరుసగా మరికొన్ని సినిమాల ప్రకటనలు వచ్చేస్తున్నాయి. ప్రశాంత వర్మ డైరెక్షన్ లో సుధాకర్ చెరుకూరి తొలి చిత్రం నిర్మించబోతున్నారు. అలానే నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో తన కొడుకు మోక్షజ్ఞతో ‘ఆదిత్య 999 మ్యాక్స్’ చేస్తానని ప్రకటించారు. ఈ మధ్యలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లోనూ ఓ సినిమా తీయబోతోందనే వార్తలు వచ్చాయి. అయితే దానిని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ధృవీకరించారు. వచ్చే యేడాది ఆ సినిమా పట్టాలు ఎక్కబోతోందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Anantapur: తెలివి మీరిన గంజాయి బ్యాచ్.
Mokshagna: విశేషం ఏమంటే వెంకీ అట్లూరి తన తొలి రెండు చిత్రాలు ‘తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను’లను బీవీయస్ఎన్ ప్రసాద్ బ్యానర్ లో చేశారు. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు… ‘రంగ్ దే, సర్, లక్కీ భాస్కర్’ లను సితార ఎంటర్ టైన్ మెంట్ చేశారు. ఇప్పుడీ సినిమా ఆ బ్యానర్ లో అతను చేయబోతున్న నాలుగోది! ఏదేమైనా వచ్చే యేడాది నందమూరి మోక్షజ్ఞ ఖాళీగా ఉండడని అర్థమౌతోంది