Ponnam Prabhaker:దీపావళి పండుగను శాంతియుతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. బుధవారం విడుదల చేసిన ఓ వీడియోలో మంత్రి కీలక సూచనలు చేశారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు దీపావళి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. టపాసుల దుకాణాలు జనవాస సముదాయాల్లో కాకుండా దూరంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అతి పెద్దదైన దీపావళి పర్వదినాన అగ్ని ప్రమాదాలను నివారించడానికి తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
Ponnam Prabhaker:టపాసులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. టపాసుల దుకాణాల వద్ద కూడా ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇండ్ల మధ్య టపాసులు కాల్చవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నట్టు చెప్పారు.