Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. కొన్ని చోట్ల ఎన్యుమరేటర్లను ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తూ, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిపై నిలదీస్తున్నారు. కాంగ్రెస్ హామీల అమలు ఏది? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని అడుగుతున్నారు. తమ వివరాలు దేనికి సేకరిస్తున్నారు? ఏమి చేస్తారో? అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దశలో రాష్ట్ర బీసీ, రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
Ponnam Prabhakar: సర్వేలో పాల్గొంటున్న ఎన్యుమరేటర్లను ఇబ్బంది పెడితే, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు కులగణన సర్వే 30 శాతం మేరకు పూర్తయిందని చెప్పారు. సర్వేలో బ్యాంకు ఖాతాల వివరాలు అడగట్టేదని తెలిపారు. కులం వివరాలు చెప్పడం ఇష్టం లేకపోతే 999 ఆప్షన్ లో నమోదు చేస్తారని మంత్రి తెలిపారు. అయినా సర్వేపై ప్రజల అనుమానాలకు సమాధానమే దొరకలేదని పలువురు పెదవి విరుస్తున్నారు.