Nara Lokesh: విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit-2026) ప్రారంభ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ తన ప్రసంగంతో గ్లోబల్ ఇన్వెస్టర్లను కట్టిపడేశారు! కేవలం సంప్రదాయ స్పీచ్లా కాకుండా.. ఏపీకున్న బలాలు, ఇక్కడ ఇప్పటికే గ్రౌండ్ అయిన భారీ ప్రాజెక్టుల లెక్కలను కళ్లకు కట్టినట్లు వివరించారు. “ఒక్కసారి ఏపీ గడ్డపై అడుగుపెట్టి ఇక్కడి స్వచ్ఛమైన గాలి, పచ్చదనం, మా పనితీరు చూస్తే మీరు మళ్లీ ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లరు.. కేవలం ఫ్యాక్టరీలు కట్టడమే కాదు, మీ కంపెనీ హెడ్ క్వార్టర్స్ (ప్రధాన కార్యాలయాలు) కూడా విశాఖ, అమరావతి లేదా రాయలసీమకు మార్చేయండి” అంటూ పారిశ్రామికవేత్తలకు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు.
ఏపీ అంటే ఏంటో చెప్పిన నంబర్స్ – ఆసక్తికర ఫ్యాక్ట్స్!
-
స్పీడ్ (వేగం): ఇక్కడ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కాదు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నడుస్తోంది. రెమాండ్స్ (Raymond) సంస్థ రాయలసీమలో ఏరోస్పేస్ & డిఫెన్స్ ప్లాంట్ను 12 నెలల్లోపే అందుబాటులోకి తేవడం, ప్రీమియర్ ఎనర్జీ 18 నెలల్లో రూ.3,293 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ కట్టడం దీనికి నిదర్శనం.
-
స్టెబిలిటీ (స్థిరత్వం): ప్రభుత్వాలు మారినా మా పాలసీలు మారవు. పరిశ్రమలకు రాయితీలు నేరుగా అందేలా దేశంలోనే తొలిసారిగా ‘ఎస్క్రో ఖాతా’ (Escrow Account) ఏర్పాటు చేశామని, త్వరలోనే ‘ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్’ తెస్తున్నామని ప్రకటించారు.
-
సర్వీస్ (సేవ): ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇస్తే అది మీ ప్రాజెక్ట్ కాదు, మా సొంత ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ గ్రౌండ్ చేసి రిబ్బన్ కట్ చేసే వరకు బాధ్యత నాదే అని భరోసా ఇచ్చారు.
రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు – గూగుల్, ఎల్జీ, కియా జోరు!
