Chiranjeevi

Chiranjeevi: అనిల్‌ రావిపూడిపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు!

Chiranjeevi: ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఒక ప్రత్యేక పోస్టు పెట్టారు. సెట్స్‌లో అనిల్ రావిపూడి ఉండే స్నేహపూర్వక తీరు, ఆయన ఫిల్మ్‌మేకింగ్‌ స్టైల్‌ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయని చిరంజీవి కొనియాడారు.

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’
అనిల్‌ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి, 2026 సంక్రాంతి పండుగ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా బృందంతో కలిసి ఆ పండుగను థియేటర్లలో సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా అనిల్‌తో కలిసి దిగిన ఒక ఫోటోను చిరంజీవి పంచుకున్నారు. అందులో దర్శకుడికి చిరంజీవి పుష్పగుచ్ఛం అందిస్తూ కనిపించారు. వారితోపాటు చిరంజీవి కుమార్తె, నిర్మాత సుస్మిత, మరొక నిర్మాత సాహు గారపాటి మరియు ఆయన భార్య కూడా ఉన్నారు.

Also Read: Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ షురూ: పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మెగాస్టార్

సినిమా వివరాలు..
చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమా అనిల్‌ రావిపూడి మార్క్‌లో, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ముఖ్యంగా, ప్రముఖ నటుడు వెంకటేశ్‌ ఇందులో అతిథి పాత్రలో సందడి చేయనున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలోని తొలి పాట ‘మీసాల పిల్ల’ విడుదలైన నాటి నుంచే ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాట లిరికల్‌ వీడియో యూట్యూబ్‌లో ఇప్పటివరకు 65 మిలియన్లకుపైగా వ్యూస్‌ సాధించింది, ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్‌, టీ సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *