Meerpet Crime: కొన్ని వార్తలకు మాటలు ఉండవు. అలంటి వార్తలు జరగకూడదు..జరిగిన మనకు తెలియకూడదు..వినకూడదు అని అనుకుంటాం. కాని కొన్ని కొన్ని సార్లు తప్పదు. ఎంత కాదనుకున్న తప్పక తెలిసిపోతుంటాయి. ఇంతకీ అంతలా వినకూడని ఆ వార్త ఏమిటి ? ఏముంది అందులో ? ప్రతి ఇంట్లో ఉండే ఇంటిటి రామాయణమే అయినా ..ఇది రామాయణంతో పోల్చే ఇంటి ఇంటి వ్యవహారం కాదు. ఇంట్లో మొగుడి రూపంలో ఉన్న రాక్షసుడి కథ …
హైదరాబాద్ లో అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానంతో భార్యను హత్య చేసిన ఆర్మీ మాజీ ఉద్యోగి ఒకరు.. ఆమె మృతదేహాన్ని కుక్కర్ లో ఉడికించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. హత్య జరిగిన తీరు తెలుసుకుని పోలీసులు సైతం నిర్ఘంతపోతున్నారు. ఇక సామాన్యులు అయితే.. హత్య చేసిన తర్వాత ఆ వ్యక్తి వ్యవహరించిన విధానం తెలిసి కంగుతింటున్నారు.
ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి గతంలో భారత ఆర్మీలో పని చేశాడు. రిటైర్మెంట్ తర్వాత భారత ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్ డీఓ లో ఔట్ సోర్సింగ్ విధానంలో సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతను కుటుంబంతో సహా.. హైదరాబాద్ లోని జిల్లెల్ల గూడలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగ రీత్య హైదరాబాద్ లో ఉంటుండగా.. వీరికి ఇద్దరు పిల్లలు. బంధువులు, కుటుంబ సభ్యలుకు ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ కుటుంబంలో అనుమానాలు విష బీజాలు నాటుకున్నాయి. అవే క్రమంగా పెరిగి పెద్దవై.. ఈ కుటుంబాన్ని తీరని విషాదం వైపు నడిపించాయి.
Meerpet Crime: అంతా బాగున్నారనుకుంటున్న తరుణంలో.. ఈ నెల 13 నుంచి గురుముర్తి భార్త్య మాధవి కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. దాంతో.. ఇంటి దగ్గర నుంచి ఆమె తల్లిదండ్రులు కంగారుగా సిటీకి వచ్చారు. తన కూతురు ఎటు వెళ్లిపోయిందో తెలుసుకోవాలని శతవిధాల ప్రయత్నించారు. ఎంత వెతికినా, ఏం చేసినా ఆమె ఆచూకీ దొరకలేదు. దాంతో.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్ పేట పోలీసుల్ని ఆశ్రయించారు. ఆమె తల్లిదండ్రులతో కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లిన గురుమూర్తి.. తన భార్య గురించి ఆవేదనగా మాట్లాడాడు.
ఇంట్లో విషయాలకు అలిగి వెళ్లిపోయిందా.. లేదా ఇంకా ఏమైనా కారణాలున్నాయా అని పరిపరి విధాలా ఆలోచిస్తున్న కుటుంబ సభ్యులకు పోలీసులు తల తిరిగిపోయే వాస్తవాన్ని తెలిపారు. ఆమె ఎటూ వెళ్లిపోలేదని.. ఆమెను భర్త గురుమూర్తినే హత్య చేశాడంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. హత్య అంటే మామూలు హత్య కాదు.. అత్యంత దారుణమైన రీతిలో ఆమె ప్రాణాల్ని తీశాడని తెలుసుకున్నారు. అదే విషయాన్ని ఆ కుటుంబానికి తెలుపగా.. వాళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేయగా.. ఆమెపై అనుమానమే ఈ దురాగతానికి కారణమని తెలిసింది. భార్యను అనుమానిస్తూ.. ఆమెతో తగవులు పెట్టుకుంటున్న గురుమూర్తి.. ఆమెను శాశ్వతంగా తొలగించుకోవాలని ప్రయత్నించాడు. జనవరి 13 న దారుణంగా హత్య చేసి.. ఆమె మృతదేహం ఎవరికీ దొరకకుండా ముక్కలు, ముక్కలుగా నరికేశాడు.
వాటిని ఎలా మాయం చేయాలా అని ఆలోచించిన నిందితుడు గురుమూర్తి.. ఆమె మృతదేహాన్ని కుక్కరో ఉడికించాడు. ఈ విషయం తెలుసుకుని అంతా షాక్ తిన్నారు. ఆ తర్వాత ఆ ముక్కల్ని జిల్లెల్లగూడలోని చందన చెరువు లో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తన భార్యను చంపడానికి ముందు హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించుకున్న గురుమూర్తి.. ముందుగా ఇంట్లో కుక్కను చంపినట్లు తేలింది. కుక్కు హతమార్చిన విధంగానే.. పక్కా ప్లాన్ తో భార్యను దారుణంగా చంపేసి కిరాతకంగా కుక్కర్ లో ఉడికించి, చెరువులో పడేసినట్లు తేల్చారు.