Andhra Pradesh: కోపం కోపం..ఆ కోపంలో ఏదైనా చేసేస్తాం. అందులోను కడప జిల్లా మాది. కత్తులు కటరాలు . దెబ్బకు ప్రాణాలు పోతాయి. నిజమే కానీ..ఇక్కడ ఉంది అలాంటి బ్యాచ్ కాదు. చేతులకు గాజులు తొడుక్కున్న ఆడ, మగ, అటు ఇటు కానీ..ఆ బ్యాచ్ కూడా కాదు. అంతకు మించి.. అమాయకురాలిని చంపేసి..పారిపోయారు పిరికి సన్నాసులు. ఒక మహిళను చంపే వాడిని మగాడు అంటారా ? లేక ఏమంటారో మీరే థింక్ చేసుకోండి.
ఓ మహిళను కొందరు వ్యక్తులు అతి దారుణంగా చంపి, వివస్త్రను చేసి.. గుర్తుపట్టకుండా ముఖాన్ని రాయితో కొట్టి నుజ్జు నుజ్జు చేశారు. ఈ దారుణ సంఘటన కడప జిల్లాలో కలకలం రేపుతుంది. ఉదయం పశువుల కాపర్లు పశువులను అటువైపుగా తీసుకువెళ్లగా వారికి మృతురాలు కనబడడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ మహిళను ఓ వ్యక్తి అక్కడికి తీసుకువచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Andhra Pradesh: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన మండలం పాపిరెడ్డి పల్లి మధ్య వ్యవసాయ పొలాల్లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. అయితే ఆ మహిళలను చూసిన వారికి ఎవరికైనా అయ్యో పాపం అనిపించాల్సిందే. ఆ మహిళను వివస్త్రను చేసి మొహంపై రాయితో కొట్టి చంపినట్లుగా కనబడుతుంది. కొంతమంది పశువుల కాపరులు అటుగా వెళ్లడంతో వారికి చనిపోయిన మహిళ కనబడింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
హత్యకు గురైన మహిళది ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం ఖాదరపల్లికి చెందిన కరిమున్నీసాగా పోలీసులు గుర్తించారు. ఆమె చేతి పై ఉన్న టాటూ ఆధారంగా ఆవిడను గుర్తించినట్లు మైదుకూరు బీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా సంఘటన స్థలానికి క్లూస్ టీం పిలిపించి వివరాలు సేకరించారు.
Andhra Pradesh: అయితే మహిళను ఓ వ్యక్తి అక్కడకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇదే విషయంపై జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. ఆల్మోస్ట్ కేసును చేదించామని ఒక వ్యక్తి ద్వారా ఆ మహిళ ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు. అతను దొరికితే పూర్తి వివరాలు సేకరించి, దోషులను త్వరలోనే పట్టుకుంటామని ఇన్చార్జి ఎస్పీ అన్నారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేశారా? లేదా హత్య మాత్రమే చేశారా? అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా హత్య అక్కడే జరిగిందా? లేదా వేరే చోట ఎక్కడైనా హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేశారా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.