Manchu family: సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన మంచు ఫ్యామిలీ

Manchu family: మంచు కుటుంబం రచకెక్కిందన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో మాటల యుద్ధం కొనసాగించిన మంచు బ్రదర్స్ ఇటివల సైలెంట్ గా ఉన్నారు. కానీ నేడు మరోసారి మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం వివాదానికి దారితీసింది.  మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయని, మనోజ్ పై దాడి జరిగిందని సాగుతున్న ప్రచారాన్ని మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది.

ఈ వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది. పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఆపాలని కోరింది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వార్తలు ప్రసారం చేయొద్దంటూ మీడియాకు హితవు పలికింది.

తనతో పాటు తన భార్యపైనా తండ్రి దాడి చేశాడని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపాయి. అయితే, కొడుకే తనపై దాడి చేశాడంటూ మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ సంచలన కథనాలు ప్రసారం చేశాయి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి తండ్రీకొడుకులు గొడవ పడ్డారని ప్రచారం చేశాయి. ఈ వార్తలను మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది. నిరాధార కథనాలను ప్రసారం చేయొద్దంటూ మీడియాకు విజ్ఞప్తి చేసింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rajnath Singh: మనం అదృష్టవంతులం కాదు.. శత్రువులతో అప్రమత్తంగా ఉండాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *