Malaysia:ఆయన అందరిలాగే బౌద్ధ సన్యాసి. తోటివారందరి లాగే సాధారణ జీవితం గడుపుతున్నాడు. బౌద్ధ బోధనలు చేస్తూ సాదాసీదాగా జీవిస్తున్నాడు. అయితే ఆయనకో ప్రత్యేకత ఉన్నది. ఆయన కుటుంబం అత్యంత ధనిక కుటుంబం. ఎంత ధనిక కుటుంబం అంటే ఆ దేశంలో మూడో అతిపెద్ద బిలియనీర్ కుటుంబం. విలాసాలు అనుభవిస్తూ, తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిని వదులుకొని బొచ్చె చేతపట్టుకొని బౌద్ధ భిక్షువుగా ఎందుకు మారాడు.. ఏమి జరిగిందో తెలుసుకుందాం రండి..
Malaysia:మలేషియాలో ఆనంద్ కృష్ణన్ బిలియనీర్. రూ.40 వేల కోట్ల ఆస్తితో ఆ దేశంలోనే మూడో అతిపెద్ద ధనవంతుడు. ఏకేగా పిలుచుకునే ఆయన ఏకైక కొడుకే అజాన్ సిరిపన్నో. అజాన్ చిన్ననాటి నుంచే అల్లారు ముద్దుగా పెరిగాడు. అత్యంత ధనిక కుటుంబం కావడంతో విలాసాల మధ్యే జీవనం గడిపాడు. ఉన్నత విద్యాభ్యాసం విదేశాల్లో చేశాడు. కోట్లకొద్ది ఆస్తి ఉండటంతో హాయిగా గడుపుతూ వచ్చాడు.
Malaysia:అజాన్ సిరిపన్నో 18వ ఏట జీవితంలో అనుకోని మార్పు వచ్చి పడింది. తన తల్లి తరఫు కుటుంబానికి నివాళులు అర్పించడానికి అజాన్.. తన అమ్మమ్మ వారి స్వస్థలమైన థాయ్‌లాండ్ దేశానికి వెళ్లాడు. అక్కడ ఎదురైన పరిస్థితులు ఆయనను పూర్తిగా మార్చివేసింది. కోట్ల ఆస్తిని కాదనుకొన్న అజాన్.. ఆనాటి నుంచి తాత్కాలికంగా సాధారణ జీవనానికి అలవాటుపడ్డాడు. ఆ తర్వాత మెల్లిగా సన్యాసిగా మారిపోయాడు.
Malaysia:ఇప్పుడు ఆజాన్ అందరు బౌద్ధ భిక్షువులు మాదిరిగానే సామాన్య జీవితం గడుపుతూ బౌద్ధ, థాయ్ అటవీ సంప్రదాయ బోధనలు ప్రచారం చేస్తూ గడుపుతున్నాడు. బౌద్ధమత సూత్రాలలో కుటుంబ ప్రేమ ఒకటి కాబట్టి.. తరచూ ఆయన తన తండ్రిని కలిసి ఆయనతో కొంతకాలం గడుపుతారు. కుమారుడి మార్గాన్ని తండ్రి ఆనంద్ కృష్ణన్ కూడా గౌరవించారు. వేల కోట్ల ఆస్తిలో లేని ఆనందాన్ని సాధారణ సన్యాసి జీవితంలోనే వెతుక్కున్నాడు అజాన్ సిరిపన్నో..