High Court: టీవీ చూడవద్దనడం.. గుడికి వెళ్లనీయకపోవడం గృహ హింస కిందకు రాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 2002లో పెళ్లి చేసుకున్న ఓ మహిళ 2003లో తన భర్త కుటుంబీకులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత మహిళ కుటుంబసభ్యులు ఆమె మృతికి కారణం ఆమె భర్త, అత్తమామలు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీవీ చూడకూడదని, గుడికి ఒంటరిగా వెళ్లకూడదని, ఇరుగుపొరుగు వారితో మాట్లాడకూడదని ఆంక్షలు విధించారని, దీంతో మనస్థాపానికి గురై కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Car Buried: కారుకు సమాధి.. లక్ తెచ్చిన వాహనానికి ఘనంగా అంత్యక్రియలు!
High Court: దీంతో పోలీసులు 498A, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కింది కోర్టు మృతురాలి భర్త, అతని తల్లిదండ్రులను దోషులుగా ప్రకటించింది.
దీనిపై బాంబే హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు నిందితులు. వివిధ దశల విచారణ అనంతరం ఈ కేసులో బాంబే కోర్ట్ ఇటీవల తీర్పు వెలువరించింది. టీవీ చూడకూడదని, ఇరుగుపొరుగు వారితో మాట్లాడకూడదని, ఒంటరిగా గుడికి వెళ్లవద్దని, అర్థరాత్రి వచ్చే నీటిని పట్టుకోమని చెప్పడం నేరం కాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

