ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. కారు బోల్తా పడటంతో అందులో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన ఏడుగురిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Nalgonda: సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారు వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందా, లేక డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో పామనిగుండ్ల వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రహదారిపై వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.