Varanasi: భారీ అంచనాల మధ్య ప్రారంభమైన, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌కు ప్రస్తుతం బ్రేక్ పడింది. దీనికి ప్రధాన కారణం మరేదో కాదు, హీరో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు (వెకేషన్) వెళ్లడమేనని తెలుస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దర్శకుడు రాజమౌళి సాధారణంగా తన సినిమాలలో పరిపూర్ణతను సాధించడానికి 2 నుండి 3 సంవత్సరాలు తీసుకుంటారనే పేరుంది. అయితే, ‘వారణాసి’ విషయంలో నిర్మాత కె.ఎల్. నారాయణ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాను రాజమౌళి “సూపర్సోనిక్ వేగంతో” పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ చిత్రాన్ని 2027లో గ్రాండ్‌గా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాజమౌళి సాధారణంగా 3-4 ఏళ్లు తీసుకుంటున్నా, ఈసారి వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు.
Also Read: Dil Raju: పవన్‌కు దిల్ రాజు క్రేజీ గిఫ్ట్?
సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ముగిసిన వెంటనే, హీరో మహేష్ బాబు విరామం తీసుకున్నారు. ఆయన తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి సెలవుల కోసం విహారయాత్రకు వెళ్లారు. దీంతో, షూటింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
గతంలో, రాజమౌళి తన ప్రాజెక్ట్‌ల కోసం హీరోలు సెలవులు తీసుకోకుండా ఉండేందుకు వారి పాస్‌పోర్ట్‌లను సీజ్ చేశారంటూ సరదా జోక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు, మహేష్ బాబు వెకేషన్ ఆపలేకపోయారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సరదా కామెంట్లు పెడుతున్నారు. మహేష్ తిరిగి రాగానే, ‘వారణాసి’ తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

