SSMB 29

SSMB 29: వేటకు సిద్ధమైన సూపర్ స్టార్.. వైరల్ అవుతున్న తాజా లుక్!

SSMB 29: SSMB29 స్టార్ట్ అయినప్పటి నుండి మహేశ్ బాబును సింహం అన్నట్టుగా చూపిస్తు వస్తున్నాడు జక్కన్న. లొకేషన్ రెక్కీకి వెళ్లినప్పుడు ఇంకా పాస్‌పోర్ట్ లాక్కున్నానని చెప్పినప్పుడు.. మహేష్‌ పేరును సింహంతో ట్యాగ్ చేసి చూపించాడు.దీన్ని బట్టి రాజమౌళి ఈసారి ఊహకందని విధంగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. షూటింగ్ మొదలైందని చెబుతున్నప్పటికీ అధికారిక ప్రకటన, మహేశ్ బాబు లుక్ ఎక్కడా రివీల్ కాలేదు. కానీ లేటెస్ట్‌గా మహేష్ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి లీక్ అయింది. జస్ట్ 14 సెకన్లు ఉన్న ఈ వీడియోలో మహేశ్ బాబును చూస్తే జూలు విదిల్చిన సింహంలా వేటకు సిద్ధమైనట్టుగా ఊరమాస్ లుక్‌లో ఉన్నాడు. భారీ గడ్డం, లాంగ్ హెయిర్‌తో అరాచకంలా ఉన్నాడు. ఇది చూసిన సూపర్ స్టార్ అభిమానులు రాజమౌళి, మహేశ్ కాంబో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు చూడని లుక్‌లో మెంటల్ మాస్ అనేలా కనిపిస్తున్నాడు మహేశ్ బాబు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Electoral Bonds: నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *