MVA Manifesto: కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. MVA దీనికి ‘మహారాష్ట్రనామ’ అని పేరు పెట్టింది. మహారాష్ట్ర అభివృద్ధికి 5 మూలస్తంభాలు ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి, పురోగతి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి, పట్టణాభివృద్ధి, పర్యావరణం, ప్రజా సంక్షేమంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి:
MVA Manifesto: ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ 5 హామీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇవి మొత్తం మహారాష్ట్ర సంక్షేమం కోసమేనని అన్నారు. ప్రతి కుటుంబానికి ఏటా రూ.3 లక్షల సాయం అందిస్తాంమని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.3,000 ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని వెల్లడించారు. సకాలంలో రుణం చెల్లించిన రైతులకు రూ.50 వేలు అందజేస్తామంటూ తమ కూటమి ఐదు హామీలను వివరించారు.