India Pakistan War

India Pakistan War: మన సైనికులకు మద్ధతిద్దాం..జై హింద్‌!

India Pakistan War:  భారత్‌ శక్తివంతమైన దేశం. ఈ రోజు మరోసారి తన సత్తాను ప్రపంచానికి చాటుతోంది భారత్‌! ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య కాదు.. కయ్యానికి కాలుదువ్వుతున్న శత్రువును నేలకూల్చే సంకల్పం! పాక్‌ తన ఉగ్ర దాడులతో మన సరిహద్దులను రక్తమయం చేయాలనుకుంది. కానీ భారత్ గట్టి సమాధానం ఇచ్చింది! 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి, 9 కీలక స్థావరాలను ధ్వంసం చేసిన మన సైన్యం, పాక్‌ను అంధకారంలోకి నెట్టింది. ఈ యుద్ధం శాంతి కోసం, భారత సార్వభౌమాధికారాన్ని ఎవరూ టచ్‌ చేయలేరన్న హెచ్చరికలు పంపడం కోసం! మన సైనికుల ధైర్యానికి మద్దతిద్దాం.

భారత్‌ ఓ శక్తివంతమైన దేశం. ఈ రోజు, మన దేశం మరోసారి తన సత్తాను ప్రపంచానికి చాటి చెబుతోంది. ఆపరేషన్ సిందూర్ – ఇది కేవలం ఒక సైనిక చర్య కాదు. ఇది భారతీయ సార్వభౌమత్వానికి తిరుగులేదని ప్రవచించే, కాలుదువ్వుతున్న శత్రువును నేలకూల్చే సంకల్పం! పాకిస్థాన్, ఆ దుర్మార్గ దేశం, తన ఉగ్ర చర్యలతో మన సరిహద్దులను రక్తమోడేలా చేయాలని చూసింది. కానీ, ఈసారి భారత్ ఊరుకోలేదు. మనం సమాధానం ఇచ్చాం. గుండెల్లో ధైర్యంతో, చేతిలో ఆయుధంతో, మన శత్రువును సమూలంగా నాశనం చేసే సంకల్పంతో సమాధానం ఇచ్చాం. మన భారత సైన్యం, అత్యంత ఖచ్చితమైన లక్ష్య సాధనతో 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించింది. అందులో 9 కీలక స్థావరాలు పాకిస్థాన్ గడ్డపై శిథిలాలుగా మారాయి. ఒక్క గురి కూడా తప్పలేదు! ఈ ఆపరేషన్ విదేశీ యుద్ధ నిపుణులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. మన సైన్యం శక్తి పాఠవం, సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన వ్యూహం ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాయి. భారత్‌తో గొడవ మొదలెట్టినవాడు తన సమాధి తానే తవ్వుకుంటాడన్న బలమైన సందేశాన్ని ఇచ్చాం.

ఇది కూడా చదవండి: India Pakistan War: 24 నగరాలే లక్ష్యంగా డ్రోన్లతో పాక్ దాడి.. తిప్పికొట్టిన భారత్..

పాకిస్థాన్, తన నీచ ఉగ్రవాద వ్యూహంతో, మన 15 నగరాలపై, మిలిటరీ కీలక స్థావరాలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేయడానికి ప్రయత్నించింది. జమ్ము ఎయిర్‌పోర్టుపై 8 మిసైళ్లు ప్రయోగించింది. కానీ, మన S-400 సుదర్శన చక్రం లాంటి నిరోధక వ్యవస్థ ఆ మిసైళ్లను ఆకాశంలోనే తునాతునకలు చేసింది. శత్రువు రాడార్ వ్యవస్థలను ముందుగానే ధ్వంసం చేసిన మన సైన్యం, పాకిస్థాన్‌ను అంధకారంలోకి నెట్టింది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది శత్రువును శాశ్వతంగా నిర్వీర్యం చేసే చారిత్రక సంగ్రామం!

ALSO READ  Assam: ఆకస్మిక వరదలు.. బొగ్గుగనిలో చిక్కుకుపోయిన కార్మికులు

“ఈ యుద్ధం ఎందుకు?” అని ప్రశ్నించే వారూ ఉన్నారు. అలాంటి వారికి కూడా సమాధానం ఒక్కటే – ఈ యుద్ధం శాంతి కోసం! దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల మన అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారి ఆత్మలకు శాంతి కల్పించడం కోసం, మన దేశ భద్రత కోసం, ఈ యుద్ధం అనివార్యం. పాకిస్థాన్‌కు ఒక గట్టి గుణపాఠం బోధించడం కోసం, మరో వందేళ్ల పాటు భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం లేకుండా చేయడం కోసం, ఈ యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, పాకిస్థాన్ వెనుక ఉన్న చైనా, టర్కీ లాంటి దేశాల కుట్రలను బయటపెట్టడానికి కూడా. ఈ యుద్ధం ద్వారా, మనం మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాం. చైనా, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక లాంటి దేశాలకు ఒక స్పష్టమైన హెచ్చరిక పంపుతున్నాం. భారత్‌తో గొడవ అంటే అగ్నిపర్వత్వాన్ని ఢీకొట్టడమే! బంగ్లాదేశ్, మన సహాయాన్ని మరచిపోయి పాక్ వైపు మొగ్గితే, దాని భవిష్యత్తూ బండబారిపోతుందని గుర్తు చేస్తున్నాం. ఈ యుద్ధం ద్వారా, మన దేశంలోని దేశద్రోహులకు, అంతర్గత శత్రువులకు కూడా ఒక గట్టి గుణపాఠం ఇస్తున్నాం. పాకిస్థాన్ వెన్ను విరిగితే, దేశంలోని అశాంతి కారకుల కీళ్లు కూడా విరిగినట్టే!

మన దేశ సార్వభౌమత్వం కోసం, భద్రత కోసం, భవిష్యత్తు కోసం జరుగుతున్న సంగ్రామం ఆపరేషన్‌ సిందూరం. మన సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కలోకి తీసుకోకుండా పోరాడుతున్న సమయమిది. వారి ధైర్యం, త్యాగం మనకు స్ఫూర్తి. ఈ యుద్ధంలో మనం అందరం కూడా భాగస్వాములం. ఏకతాటిపై నిలబడి, మన సైన్యానికి మద్దతు ఇద్దాం. జై భారత్‌.. జై హింద్‌!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *