Machilipatnam

Machilipatnam: రెచ్చిపోతున్న కామాంధులు మైనర్ బాలికపై అత్యాచారయత్నం

Machilipatnam: ఆడవారిపై లైంగిక దాడులకు పాల్పడుతూ కామాంధులు రెచ్చిపోతున్నారు. పది రోజుల వయసున్న పాప నుంచి పండు ముసలి వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. కామవాంఛలు తీర్చుకోవడమే లక్ష్యంగా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. దేశంలో ఆడవారిపై అత్యాచారాలు, హత్యాచారాలకు సంబంధించి రోజుకో ఘటన వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే మరో లైంగిక దాడి సంచలనం సృష్టిస్తోంది. ఓ వైపు ప్రేమ పేరుతో ప్రేమోన్మాదులు యువతులపై యాసిడ్, కత్తులతో దాడులు చేస్తుంటే.. మరోవైపు గంజాయి, మద్యం మత్తులో దుర్మార్గులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

తాజాగా అటువంటి ఘటనే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది. పంపుల చెరువు కాలనీకి చెందిన ఓ బాలిక 8వ తరగతి చదువుతూ స్థానికంగా నివాసం ఉంటోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు మద్యం, గంజాయి సేవిస్తూ కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లి వస్తున్న బాలికపై ఆ గంజాయి బ్యాచ్ కన్నుపడింది.

ఇది కూడా చదవండి: Pavan kalyan: 11 సీట్లు వచ్చిన మారలేదు..పవన్ హై ఓల్టేజ్ కామెంట్స్..

Machilipatnam: బాలికను రోజూ ఫాలో చేసిన ఆ కామాంధులు సమయం కోసం ఎదురు చూశారు. చిన్నారి ఒంటరిగా వెళ్లడాన్ని గమనించిన ఇద్దరు గంజాయి బ్యాచ్ బాలికను అపహరించారు. చిన్నారి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి పంపుల చెరువుల వెనక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అనంతరం అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.అయితే బాలిక గట్టిగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్థానిక యువత అప్రమత్తమయ్యారు.

Machilipatnam: ఆమె అరుపులు వినిపిస్తున్న ప్రాంతానికి పరుగులు పెట్టారు. స్థానికులు వస్తుండడాన్ని గమనించిన నిందితులిద్దరూ చిన్నారిని వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటపడిన వారంతా ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మరో వ్యక్తి స్థానికులకు చిక్కకుండా పరారయ్యాడు. బాధిత కుటుంబం సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన మరో వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అతన్నీ అదుపులోకి తీసుకున్నారు.

అయితే అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తులు గంజాయి సేవించినట్లు బాలిక బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి సేవిస్తూ ప్రతి రోజూ స్థానికంగా హల్ చల్ చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని, గంజాయి బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *