Loan Apps: అనధికార లోన్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం మరోసారి పంజా విసిరింది. సైబర్ మోసాలు, వేధింపులు, అధిక వడ్డీ దోపిడీలపై తరచూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ లోన్ యాప్స్‌పై నిషేధం విధించి అక్రమాలకు చెక్ పెట్టింది. డిజిటల్ లోన్ యాప్స్‌పై కేంద్ర పర్యవేక్షణను ఇంకా కఠినతరం చేయనున్నట్టు సమాచారం. ఆర్బీఐ, ఐటీ మంత్రిత్వ శాఖ కలిసి ఈ లోన్ యాప్స్‌పై సమగ్ర అధ్యయనం అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
Loan Apps: ఈ మేరకు మొత్తంగా 87 అక్రమ రుణ యాప్స్‌ను బ్లాక్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000లోని సెక్షన్ 69ఏ కింద సమాచారాన్ని తనిఖీ చేసి సమగ్ర దర్యాప్తు చేసే అధికారం కేంద్ర ఐటీ శాఖకు ఉన్నది. ఇంకా మరికొన్నింటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆశాఖ ప్రకటించింది.
Loan Apps: కంపెనీల చట్టం-2013 ప్రకారం.. లోన్‌యాప్స్ ద్వారా ఆన్లైన్ రుణ కార్యకలాపాల్లో పాల్గొనే కంపెనీలపై దర్యాప్తు, ఖాతాల తనిఖీలు, నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు తీసుకుంటామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి లోక్‌సభలో కూడా ప్రకటించారు. ఆ చట్టం ప్రకారం.. ఏదైనా నిబంధనలు ఉల్లంఘించినట్టయితే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టంచేశారు.
