Lingamaneni Engagement: ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కుమారుడు శ్రీనిష్, ప్రముఖ వ్యాపారవేత్త బిగ్ సీ అధినేత బాలు చౌదరి కుమార్తె ఐశ్వర్యల వివాహ నిశ్చయ తాంబూల వేడుక హైదరాబాద్ హైటెక్స్ లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అతిరధ మహారధులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహా న్యూస్ ఛైర్మన్, ఎండీ వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో అన్నీ తానై వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సతీసమేతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు, సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ ఉదయ భాస్కర్, ఎంపీ కేశినేని చిన్ని, ఏపీ మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి, అచ్చెం నాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, పత్తిపాటి పుల్లారావు, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, మెహర్ రమేష్, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, డీజీపీ ద్వారకా తిరుమలరావు, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.
లింగమనేని రమేష్ తనయుడు శ్రీనిష్ నిశ్చితార్ధ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర ప్రముఖులు
ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కుమారుడు శ్రీనిష్, ప్రముఖ వ్యాపారవేత్త అధినేత బాలు చౌదరి కుమార్తె ఐశ్వర్యల వివాహ నిశ్చయ తాంబూల వేడుక పూర్తి ఈవెంట్ ఇక్కడ చూడొచ్చు