KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు వైరల్ ఫీవర్‌తో అస్వస్థతకు గురవ్వడంతో తనని కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు, ఆయనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి ఆసుపత్రిలో పరామర్శించారు.
హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరీష్‌రావును కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించిన కేటీఆర్..కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఇది కూడా చదవండి: Air India flight: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతికలోపం
వైద్యుల ప్రకారం, డీహైడ్రేషన్ కారణంగా హరీష్ రావుకు వైరల్ ఫీవర్ ఏర్పడినట్లు తెలియజేశారు. ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ చేయనున్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా హరీష్ రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఆకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
హరీష్ రావును పరామర్శించిన కేటీఆర్
బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో చేరిన హరీష్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి పరామర్శించారు
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న హరీష్ రావును పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన కేటీఆర్
డిహైడ్రేషన్… https://t.co/bGCKhqeDea pic.twitter.com/INIF6Ia5gw
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2025