Krish Marriage

Krish Marriage: దర్శకుడు క్రిష్ వివాహం.. కలర్ ఫోటో డైరెక్టర్ ఎంగేజ్మెంట్

Krish Marriage: ఇటీవల చిత్రసీమలో పెళ్ళిళ్ళ హంగామా జోరుగా సాగుతోంది. ఓ వైపు వివాహాలు, మరోవైపు నిశ్చితార్థాలతో సందడి సందడిగా ఉంటోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్… డాక్టర్ చల్లా ప్రీతి మెడలో నవంబర్ 11న మూడు ముళ్ళు వేశారు. గతంలో ఆయన వివాహం ఓ డాక్టర్ తోనే జరిగింది. అయితే పరస్పర అంగీకారంతో వారిరువురు ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన క్రిష్ ఇప్పుడు అనుష్క నాయికగా ‘ఘాటి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే… షార్ట్ ఫిల్మ్ మేకింగ్ నుండి వెండితెరపైకి వచ్చిన సందీప్ రాజ్ ‘కలర్ ఫోటో’తో మెగా ఫోన్ పట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా, రచయితగానూ పేరున్న సందీప్ రాజ్ వివాహ నిశ్చితార్థం నవంబర్ 11న వైజాగ్ లో నటి చాందినీరావుతో జరిగింది. డిసెంబర్ 7న వీరి పెళ్ళి తిరుపతిలో జరుగబోతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tamil Nadu: తమిళనాడులో అమానుష ఘటన..3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన 16 ఏళ్ల బాలుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *