Nalgonda

Nalgonda: మిస్టరీ వీడింది.. పాఠాలు చెప్పిన గురువునే కడతేర్చిన విద్యార్థులు..

Nalgonda: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి (Rupa Reddy) దారుణ హత్య కేసు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు యావత్ తెలుగు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులే.. అక్షరాలు నేర్పిన గురువు ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలు, యువతలో పెరుగుతున్న గంజాయి మహమ్మారి, చెడు వ్యసనాలు ఎలాంటి దారుణాలకు దారితీస్తున్నాయో కళ్లకు కట్టాయి.
అసలేం జరిగింది?.. గంజాయి మందలింపు.. పగబట్టిన విద్యార్థులు!
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం..
  • మందలించడమే కారణమా?: కొద్దిరోజుల క్రితం కొందరు పదో తరగతి విద్యార్థులు గంజాయి తాగుతుండగా ప్రిన్సిపల్ రూపారెడ్డి చూసి మందలించారు. దానితో పటు వారు గంజాయి తాగుతున్న వీడియోలు ఇంకా ఫోటోలు ఆమె తీసుకుంది దింతో  ఎక్కడ ఈ విషయం బయటపెడతారేమోనన్న భయం, కక్ష విద్యార్థుల్లో పెరిగింది.
  • జల్సాల కోసం ప్లాన్: గంజాయి వ్యసనం, విచ్చలవిడి ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో ప్రిన్సిపల్ ఇంట్లోనే చోరీ చేయాలని పథకం వేశారు.
  • పక్కా రెక్కీ – 9 నిమిషాల్లో దారుణం: ఆగస్టు 11న సాయంత్రం రూపారెడ్డి స్కూల్ నుంచి ఇంటికి రాకముందే విద్యార్థులు గోడ దూకి లోపలికి చొరబడ్డారు. ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించి వంటగదిలో దాక్కున్నారు. ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడి ఏకంగా 27 సార్లు పొడిచి కిరాతకంగా హతమార్చారు.
  • నగదుతో పరారీ: హత్య అనంతరం ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న సుమారు రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీటీవీ కెమెరాల్లో చిక్కకుండా జాగ్రత్తపడి, ఆ డబ్బుతో హైదరాబాద్ చేరుకుని విచ్చలవిడిగా జల్సాలు చేశారు.

ప్రత్యేక బృందాలతో నిందితుల గుర్తింపు:

ఈ అమానవీయ ఘటనపై నల్లగొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి..
  1. 80 మంది విచారణ: స్కూల్ సిబ్బంది, స్థానికులు సహా దాదాపు 80 మందిని విచారించి సాంకేతిక ఆధారాలు సేకరించారు.
  2. ఇబ్రహీంపట్నం వద్ద పట్టివేత: కొండమల్లేపల్లి పరిసర తండాలకు చెందిన పదో తరగతి విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి, ప్రధాన నిందితుడిని ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *