Konda Surekha

Konda Surekha: ‘బిగ్ అప్‌డేట్’ పోస్ట్ నాది కాదు.. నేను కాంగ్రెస్ లోనే ఉంటా..!

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. ఒకవైపు సోషల్ మీడియాలో తన పేరిట జరుగుతున్న ప్రచారంపై సురేఖ స్వయంగా వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
‘బిగ్ అప్‌డేట్’ వార్తలపై కొండా సురేఖ స్పష్టత
కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత, కొండా సురేఖ పేరిట ఉన్న ఒక ఫేస్‌బుక్ ఖాతాలో “ఇక నిరీక్షణ ముగిసింది.. త్వరలోనే బిగ్ అప్‌డేట్ రాబోతోంది.. స్టే ట్యూన్డ్” అంటూ వచ్చిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సురేఖ ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఈ ప్రచారంపై కొండా సురేఖ వెంటనే స్పందించి ఖండించారు..
తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఆ పోస్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాల లింకులను స్వయంగా పంచుకుంటూ, కేవలం అధికారిక వేదికల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రజలు, మీడియా ప్రామాణికంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని స్పష్టం చేశారు.

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *