Komatireddy Venkatreddy: సినీ ప్రేక్షకులకు గట్టి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై ఏ హీరో కైనా బెనిఫిట్ షో లు ఉండవని తేల్చి చెప్పింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు బంద్ చేస్తున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సంధ్య థియేటర్లో పుష్ప -2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. మరో బాబు ఆస్పత్రిలో క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు.ఈ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కాక ఈ ఘటనలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సహా పలువురుపై కేసులు నమోదయ్యాయి.