Komatireddy Venkata Reddy: బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పలుమార్లు వారిద్దరిపైనా కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా అదే తీరున వ్యాఖ్యానించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతుండగా, నల్లగొండలో నిన్న జరిగిన సభలో కేటీఆర్ వ్యాఖ్యలను కోమటిరెడ్డికి గుర్తు చేయడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Venkata Reddy: కేటీఆర్, హరీశ్‌రావులు తన కాలిగోటికి కూడా సరిపోరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పేరు చెప్పుకొని వారిద్దరూ ఎమ్మెల్యేలు అయి, మంత్రులయ్యారని ఘాటుగా విమర్శించారు. తాను నీతి, నిజాయితీగా పైకి ఎదిగిన రాజకీయ నేతను అని చెప్పుకొచ్చారు. తనపై అవినీతి మరకే లేదని వ్యాఖ్యనించారు.
Komatireddy Venkata Reddy: పదేండ్లు అధికారంలో ఉండి కేటీఆర్ నల్లగొండ ఒకటి రెండు సార్లే వచ్చారని, ఇప్పుడు విద్యార్థులకు ఏదో చేస్తారని యూనివర్సిటీకి వెళ్లారని ఆరోపించారు. వారి వల్లే ఫ్లోరైడ్ పెరిగిందని, శ్రీశైలం సొరంగమార్గాన్ని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు తనపై ఎందుకు మాట్లాడుతున్నారని, వారికి ఆ నైతిక హక్కు లేదని అన్నారు. కేసీఆర్‌కే ఆ హక్కు లేదని, కేటీఆర్ ఎంత ఓ బచ్చా అంటూ ఘాటా వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Venkata Reddy: హరీశ్‌రావు మామ చాటు అల్లుడని, కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అని ఎద్దేవా చేశారు. నల్లగొండలో కేవలం ఐదారు వేల మందితో సభ పెట్టి ఏదో ఉద్దరించినట్టు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఎక్కడ చౌరస్తాలో మీటింగ్ పెట్టిన ఐదారు వేల మంది వస్తారని చెప్పారు. దాన్ని ఏదో బూతద్ధంలో పెట్టి చూపెడుతున్నారని ఆరోపించారు.
మీడియా సమక్షంలో కేటీఆర్ సభకు వచ్చిన జనాన్ని లెక్కిద్దామని సవాల్ విసిరారు.