Kishan reddy: నిరుపేదల ఇళ్లను కూల్చకుండా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ పనులను చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్ది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రత్యక్ష రాజకీయాల్లో తాము ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. మూసీ బస్తీల్లో ఒకరోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వీకరించారు. ఈ మేరకు ఆయన రాత్రి అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని తలసీరామ్ నగర్ లోని ఓ ఇంట్లో భోజనం చేసి అక్కడే ఆయన నిద్రించారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఇక ముందు కూడా అది జరగబోదని క్లారిటీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయని గుర్తు చేశారు. తన డీఎన్ఏ ఏమిటో ప్రజలకు తెలుసని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు.డీపీఆర్, నిధులు లేకుండా మూసీ పునరుజ్జీవం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పేదవాళ్ల మీద నుంచి బుల్డోజర్లు ఎక్కిస్తారా.. వేల ఇళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను కూల్చుతారా అని ప్రశ్నించారు. పదేళ్ల తరువాత నల్లగొండ ప్రజలకు నీళ్లు ఇవ్వడం కాదని.. వెంటనే ఇవ్వాలని అన్నారు. అందుకు ఏకైక పరిష్కారం రీటైనింగ్ వాల్ కట్టడమేనని తెలిపారు.