Dilruba: ఈ యేడాది ‘క’ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు కిరణ్ అబ్బవరం. అతని తాజా చిత్రం ‘దిల్ రూబా’ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. అయితే సోమవారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని కిరణ్ అబ్బవరం తెలిపాడు. శివమ్ సెల్యులాయిడ్, సారెగమ సంస్థలు కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. విశ్వకరణ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘హిజ్ లవ్… హిజ్ యాంకర్’ అనే కాప్షన్ తో వస్తున్న ఈ సినిమాలో లవ్ అండ్ యాక్షన్ కు స్కోప్ ఉందని తెలుస్తోంది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్ రూబా’ను వచ్చే యేడాది ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
Squid Game: ‘స్క్విడ్ గేమ్’ సీజన్ -2 ట్రైలర్ వచ్చేసింది!
Squid Game: 2021లో నెట్ ఫ్లిక్స్ లో వేదికగా స్ట్రీమింగ్ అయిన ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సీరిస్ కు మంచి ఆదరణ లభించింది. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా జీవితాలను పణంగా పెట్టి ఆట ఆడే 456 మందికి సంబంధించిన ఈ కథతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కనెక్ట్ అయ్యారు. దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దీనిని తెరకెక్కించారు. 2009లోనే ఆయన కథను రాసుకున్నా… ఆర్థికంగా అన్ని సమకూర్చుకుని ప్రేక్షకుల ముందుకు దీనిని తీసుకు రావడానికి ఆయన చాలా కష్టాలే పడ్డాడు. అయితే దీనికి లభించిన విజయం వాటన్నింటినీ మర్చిపోయేలా చేసింది. దాంతో దీని సీజన్ 2 కోసం అందరూ ఎదురు చూడటం మొదలైంది. వారి ఎదురుచూపులకు తెర దించుతూ డిసెంబర్ 26 నుండి దీనిని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతోంది. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా వచ్చింది.