GV Prakash: సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ వందకు పైగా సినిమాలు చేశాడు. అంతేకాదు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. ఇక నటుడిగానూ తనదైన ముద్రను వేసిన జీవీ ప్రకాశ్ నటించిన 25వ చిత్రం ‘కింగ్ స్టన్’. ఇండియాలోనే మొదటి సీ ఫాంటసీ అడ్వంచర్ మూవీగా దీనిని కమల్ ప్రకాశ్ తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా మార్చి 7న విడుదల కాబోతోంది. గతంలో జీవీ ప్రకాశ్ కుమార్ తో కలిసి ‘బ్యాచిలర్’ మూవీలో నటించిన దివ్య భారతి ఇందులో హీరోయిన్. జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ సంయుక్తంగా ‘కింగ్ స్టన్’ మూవీని నిర్మిస్తున్నాయి.