Kiara Advani

Kiara Advani: ఈ యేడాది కియారా చిత్రాలు నాలుగు!

Kiara Advani: గత యేడాది కియారా అద్వానీ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ యేడాది ఆమె సినిమాలు ఏకంగా నాలుగు విడుదల కానున్నాయి. యేడాది ప్రారంభంలోనే కియారా నాయికగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న రాబోతోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలానే కియారా నటించిన కన్నడ చిత్రం ‘టాక్సిక్’ సైతం పాన్ ఇండియా మూవీనే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పట్లో దీనిని షూటింగ్ పూర్తి కావడం కష్టమే అందుకే ఈ యేడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయొచ్చు.

ఇది కూడా చదవండి: Tirupati Stampede Video: తిరుపతి ఘటనపై మాహా వంశీ గ్రౌండ్ రిపోర్ట్.. నిజానిజాలివే!

Kiara Advani: ఇక కియారా ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు కమిట్ అయ్యింది. అందులో ‘వార్ -2’ ఆగస్ట్ 15న విడుదల అవుతుందని అంటున్నారు. అలానే మ్యాడ్ లాక్ ఫిలిమ్స్ బ్యానర్ లోనూ కియారా ‘శక్తి శాలిని’ మూవీలో నటించబోతోంది. భారత జానపద గాథ ఆధారంగా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లేదా మేలో మొదలవుతుంది. దీనిని ఇదే యేడాది డిసెంబర్ 31న విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. సో తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ యేడాది కియారా అద్వానీ నటిస్తున్న చిత్రాలు నాలుగు జనాలను పలకరించబోతున్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mohan Babu: మోహన్ బాబు ఇలాకాలో మరో వివాదం.. వీడియోతో సహా దొరికిన సిబ్బంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *