Khushi Kapoor: శ్రీదేవి రెండోకుమార్తె ఖుషీ కపూర్ నటిస్తున్న ‘లవ్ యాపా’ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఫాంటమ్ స్టూడియోస్ ‘లవ్ యాపా’ను నిర్మిస్తోంది. ఇద్దరు ప్రేమికులకు సంబంధించిన భావోద్వేగాల అందంగా తెరకెక్కించినట్టు దర్శకుడు చెబుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా నుండి మరో గీతం విడుదలైంది. ‘కౌన్ కిన్నా జరూరీ…’ అనే ఈ పాటను విశాల్ మిశ్రా పాడారు. మరి ఖుషీ, జునైద్ లకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
