Khushboo ఒకప్పటి సినీ తార, ప్రస్తుత బీజేపీ నేత కుష్బూ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. కొంతకాలం క్రితం ఆమె ‘ఎక్స్’ (పూర్వంలో ట్విట్టర్) అకౌంట్ హ్యాక్ చేయబడడంతో సామాజిక మాధ్యమాలకు విరామం తీసుకున్నారు. ఇటీవల అకౌంట్‌ను పునరుద్ధరించుకున్న కుష్బూ తాజాగా అభిమానులతో మళ్లీ సంపర్కంలోకి వచ్చారు.
తాజాగా ‘గోల్డెన్ గ్లో’ పేరుతో ఆమె తన అల్ట్రా స్లిమ్ లుక్ లో ఉన్న కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫొటోలలో కుష్బూను గుర్తించలేని స్థాయిలో తన రూపాన్ని మార్పు చేసుకున్నారు. చాలా మంది చూసి ఇది కుష్బూనేనా? అని ఆశ్చర్యపోయేలా ఆమె ఫిజిక్ మారిపోయింది.
అయితే, ఈ ఫొటోలపై ఒక నెటిజన్ విమర్శలు చేస్తూ – “బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నవారు ఇలాంటి ఫొటోలు పోస్టు చేయడం సిగ్గుచేటు” అంటూ కామెంట్ చేశాడు. దీనికి కుష్బూ ఘాటుగా స్పందిస్తూ –
“ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. కానీ మీ వ్యాఖ్య చూస్తుంటే మీ మనస్తత్వమే సిగ్గుచేటు అనిపిస్తోంది సర్” అని బదులిచ్చారు.
కుష్బూ తాజా లుక్‌కు చాలామంది నెటిజన్లు అభినందనలు, ప్రోత్సాహకర వ్యాఖ్యలు చేశారు. కొందరు అయితే ఆమెకి ఇదే నిజమైన రీ–ఇన్వెన్షన్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.