Formula E Race Case: ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిపిన ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు, నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే చార్జిషీట్ దాఖలు కానుంది.
చార్జిషీట్‌లో కీలక వ్యక్తులు
9 నెలల పాటు ఏసీబీ అధికారులు ఈ కేసును లోతుగా విచారించారు. ఈ విచారణలో మాజీ మంత్రి కేటీఆర్ (A1), సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (A2), హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి (A3)తో పాటు మరో ఇద్దరు నిందితులపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు గుర్తించారు.
కేసు వివరాలు
ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రభుత్వ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. అందుకే ఏసీబీ ఇప్పుడు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.