Anirudh Wedding

Anirudh Wedding: జాక్ పోర్ట్ కొట్టిన అనిరుద్.. కావ్య మారన్ తో పెళ్లి ఫిక్స్.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా..?

Anirudh Wedding: సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా  విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఇంటర్నెట్ మోస్ట్ ఫేవరెట్ రూమర్ కి  ఎండ్ కార్డ్ పడింది. ఐపీఎల్  క్రేజీ ఫ్రాంచైజీ ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ (SRH) సీఈఓ, నేషనల్ క్రష్ కావ్య మారన్.. సౌత్ ఇండియా సెన్సేషనల్ మ్యూజిక్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌లు ఏడడుగులు వేయబోతున్నారు. ఎలాంటి పీఆర్ లీకులు, గాసిప్ వెబ్‌సైట్ల హడావుడి లేకుండా.. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయడంతో ఇంటర్నెట్ ఒక్కసారిగా షేక్ అయింది.

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి స్వయంగా విచ్చేశారు. తమ ఏకైక కుమార్తె కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్‌ల వివాహ విందుకు (Wedding Reception) రావాల్సిందిగా సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు.
Image
ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్‌లో పంచుకుంటూ పెళ్లి తేదీని అధికారికంగా రివీల్ చేశారు..
“సన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ కళానిధి మారన్, ఆయన సతీమణి శ్రీమతి కావేరి మారన్ జూబ్లీహిల్స్‌లోని మా నివాసంలో నన్ను కలిసి, తమ కుమార్తె కావ్య మారన్ వివాహ విందుకు ఆహ్వానించారు. కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో జరగనుంది.”

రాక్‌స్టార్ అనిరుధ్ – మ్యూజిక్ కింగ్ సంపాదన ఎంత?..

‘వై దిస్ కొలవెరి డి’ పాటతో ఓవర్‌నైట్ గ్లోబల్ సెన్సేషన్‌గా మారిన అనిరుధ్ రవిచందర్.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు.
  • నెట్ వర్త్: అనిరుధ్ వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు రూ. 50 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి.
  • సినిమాలు & ఈవెంట్స్: రజినీకాంత్ (‘జైలర్’), విజయ్ (‘లియో’), కమల్ హాసన్ (‘విక్రమ్’), షారుఖ్ ఖాన్ (‘జవాన్’), ఎన్టీఆర్ (‘దేవర’) వంటి భారీ పాన్-ఇండియా సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు.
  • భారీ లైనప్: రాబోయే రోజుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘AA23’ తో పాటు పలు బిగ్గెస్ట్ ప్రాజెక్టులకు ఆయన మ్యూజిక్ అందించనున్నారు. ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 12 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు లైవ్ కన్సర్ట్స్, మ్యూజిక్ రాయల్టీలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు.

కావ్య మారన్ సామ్రాజ్యం – వందల కోట్ల బిజినెస్ నెట్‌వర్క్..

ఇండియాలో బిగ్గెస్ట్  నెట్‌వర్క్ లో ఒక్కటైన సన్ గ్రూప్’ అధినేత కళానిధి మారన్ మారన్ ఏకైక కుమార్తె కావ్య మారన్.
  • వ్యక్తిగత ఆస్తులు: కావ్య మారన్ నెట్ వర్త్ సుమారు రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు. సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు, డివిడెండ్లు, ఫ్రాంచైజీ ప్రాపర్టీల ద్వారా ఆమెకు భారీ ఆదాయం సమకూరుతుంది.
  • కంబైన్డ్ వెల్త్: ఇప్పుడు అనిరుధ్, కావ్య మారన్‌ల ఉమ్మడి ఆస్తి విలువ ఏకంగా రూ. 450 కోట్ల నుంచి రూ. 560 కోట్ల పైమాటే అని విశ్లేషకులు చెబుతున్నారు.

కేవలం వారసురాలు మాత్రమే కాదు.. పక్కా సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఐకాన్!..

  • హై-ఎండ్ ఎడ్యుకేషన్:
    1991లో చెన్నైలో జన్మించిన కావ్య, ప్రతిష్టాత్మక స్టెల్లా మేరీస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత యూకేలోని టాప్ బిజినెస్ స్కూల్ అయిన ‘వార్విక్ బిజినెస్ స్కూల్’ (Warwick Business School) నుంచి మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు.
  • 2018లో ఎస్ఆర్‌హెచ్ బాధ్యతలు:
    రొటీన్ కార్పొరేట్ ఆఫీస్ పనులకు పరిమితం కాకుండా, స్పోర్ట్స్ పట్ల ఉన్న ప్యాషన్‌తో 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓగా పగ్గాలు చేపట్టారు. క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు, విక్టరీ సెలబ్రేషన్లు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయ్యాయి.
  • ఐపీఎల్ ఫైనల్స్ & గ్లోబల్ రికగ్నిషన్:
    ఆక్షన్ టేబుల్ వద్ద ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో ఆమె వేసిన పక్కా లెక్కలు, ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్ వంటి ఛాంపియన్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్న వ్యూహాలు 2024 ఐపీఎల్ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను ఫైనల్స్‌కు చేర్చాయి.
  • అంతర్జాతీయ గుర్తింపు:
    క్రీడా వ్యాపార రంగంలో ఆమె చూపిన ప్రతిభకు గానూ ‘ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్’, అంతర్జాతీయ వినోద పత్రిక ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ప్రకటించిన ‘ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్’ పవర్ లిస్ట్‌లో కావ్య మారన్ చోటు దక్కించుకున్నారు.
నవంబర్ 21న చెన్నై నగరంలో జరగనున్న వీరి వెడ్డింగ్ రిసెప్షన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న సినీ దిగ్గజాలు, ఐపీఎల్ క్రికెటర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. సంగీత ప్రపంచపు రాక్‌స్టార్, వ్యాపార రంగపు పవర్ ఉమెన్ ఒక్కటవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు వీరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *