Karthikeya

Karthikeya: దర్శకుడిగా మారుతున్న కార్తికేయ?

Karthikeya: ‘RX 100’ సినిమాతో టాలీవుడ్‌లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన యువ హీరో కార్తికేయ గుమ్మకొండ త్వరలోనే సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. 2024లో వచ్చిన ‘భజే వాయు వేగం’ సినిమా తర్వాత వెండితెరపై కనిపించకపోవడంతో కార్తికేయ తదుపరి ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ఆయన కథానాయకుడిగానే కాకుండా స్వయంగా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
రూ. 30 కోట్ల బడ్జెట్ కథ – నిర్మాతల నిరాకరణ.. 
‘భజే వాయు వేగం’ దర్శకుడు ప్రశాంత్ రెడ్డితో కలిసి కార్తికేయ దాదాపు ఏడాది పాటు ఒక భారీ కాన్వాస్ ఉన్న కథపై పనిచేశారు. అయితే, ఆ ప్రాజెక్ట్ బడ్జెట్ సుమారు రూ. 30 కోట్లు కావడంతో వర్కవుట్ కాలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (నాగవంశీ), మైత్రీ మూవీ మేకర్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ సహా పలు ప్రముఖ నిర్మాణ సంస్థలను సంప్రదించినప్పటికీ వివిధ కారణాల వల్ల చర్చలు కార్యరూపం దాల్చలేదు. గతంలో నాని ‘గ్యాంగ్‌లీడర్’ సమయంలో మైత్రీ సంస్థ ఆయనతో హీరోగా సినిమా చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఈ భారీ బడ్జెట్ కథ సెట్ అవ్వలేదు.

సొంత బ్యానర్‌లోనే దర్శకత్వం & నిర్మాణం:

పెద్ద సంస్థల నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో కార్తికేయ స్వయంగా తానే ఒక సరికొత్త కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది..
  1. డైరెక్టర్‌గా కార్తికేయ: ఈ కథను వేరొకరి చేతుల్లో పెట్టకుండా తానే స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు.
  2. స్వంత బ్యానర్‌పై నిర్మాణం: గతంలో తన సొంత చిత్రాలను రూపొందించిన ‘కార్తికేయ క్రియేటివ్ వర్క్స్’ (Kartikeya Creative Works) బ్యానర్‌పైనే ఈ సినిమాను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *