Kannappa Movie: ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయమైనట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ హార్డ్ డిస్క్‌తో ఇద్దరు వ్యక్తులు పరారైనట్టు తెలుస్తున్నది. ఈ విషయం తాజాగా బయటకు రావడంతో సినీ సర్కిళ్లలో సంచలనంగా మారింది. సుమారు రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ సినిమా హార్డ్ డ్రైవ్ విషయంలో నిర్మాణ సంస్థ ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందోనని సినీవర్గాలు పెదవి విరుస్తున్నాయి.
Kannappa Movie: కన్నప్ప సినిమాకు అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ఫిల్మ్‌నగర్‌లోని 24 ఫ్రేమ్స్ సంస్థకు డీటీడీసీ కొరియర్ ద్వారా ముంబైలోని హెచ్ఐవీఈ సంస్థ పంపించింది. ఈ పార్సిల్‌ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే మహిళకు అందించాడని, అప్పటి నుంచి వారిద్దరూ కనిపించడం లేదని 24 ఫ్రేమ్స్ సంస్థ తాజాగా తెలిపింది. దీంతో కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయమైందని నిర్ధారణకు వచ్చారు.
Kannappa Movie: ఈ మేరకు సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు 24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై నమ్మకద్రోహం కేసు నమోదు చేశారు. మంచు విష్ణు నటించిన ఆ కన్నప్ప చిత్రంలోని కీలక దృశ్యాలు ఆ హార్డ్ డ్రైవ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ డ్రైవ్‌తోనే ఆఫీస్ బాయ్ రఘు మరొకరు పరారైనట్టు ఫిర్యాదు అందింది.
Kannappa Movie: కన్నప్ప సినిమాపై తొలి నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్, నెగెటివ్ షేడ్స్ ప్రచారం అవుతూ వచ్చాయి. మునుపెన్నడూ లేనంతగా మంచు విష్ణు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారని, ఆయన స్థాయికి మించి దీనిని రూపొందిస్తున్నారని కొందరు పేర్కొన్నారు. ఇది మంచి రికార్డు నమోదు చేస్తుందని ఇంకొందరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Kannappa Movie: ఈ నేపథ్యంలో విడుదలకు దగ్గరైన వేళ ఈ సినిమా హార్డ్ డ్రైవ్ మాయమవడంపై మంచు విష్ణు కుటుంబంతోపాటు తోటి నిర్మాణ సహకారం అందించిన కుటుంబాలు ఆందోళనలో పడిపోయాయి. కొందరు పెద్దవాళ్లు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరినీ పట్టుకొని చర్యలు తీసుకోవాలని 24 ఫ్రేమ్స్ సంస్థ కూడా పోలీసులను కోరారు.