Kamal Haasan

Kamal Haasan: ‘ఇండియన్ -3’ రీషూట్ కు కమల్ ఆలోచన!

Kamal Haasan: ‘ఇండియన్’కు సీక్వెల్ గా వచ్చిన ‘ఇండియన్ -2’ చిత్రం బాక్సాఫీస్ బరిలో ఘోరంగా బోల్తా కొట్టింది. అయితే అప్పటికే ‘ఇండియన్ -3’ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావడంతో దీనిని వీలు చూసుకుని ఓటీటీలో విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ కమల్ హాసన్ ఇప్పుడీ సినిమాకు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టాడట. ‘ఇండియన్ -2’ దారుణంగా పరాజయం పాలు కావడంతో ‘ఇండియన్ -3’ ని రీ-షూట్ చేసి సరికొత్తగా దీనిని ప్రజెంట్ చేసే పనిలో ఉన్నాడట. శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం పూర్తి కాగానే శంకర్ ‘ఇండియన్ -3’ రీషూట్ పై దృష్టి పెడతాడని అంటున్నారు. అదే జరిగి… ‘ఇండియన్ -3’ స్క్రిప్ట్ కు రిపేర్స్ చేస్తే… ఓటీటీలో కాకుండా దానిని థియేటర్లలోనే విడుదల చేసే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం… మరి ఏం జరుగుతుందో!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rajeev Kanakala: వైవిధ్యంతో రాజీవ్ పయనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *