Kalki 2: ‘కల్కి 2898 AD’ సైన్స్ ఫిక్షన్ మైథాలజీతో సెన్సేషనల్ హిట్ అయింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె ‘సుమతి’ పాత్రలో కీలకం అయ్యింది. ఇప్పుడు సీక్వెల్‌లో దీపికా తప్పుకున్నారు. ఆమె స్థానంలో సాయి పల్లవిని పరిశీలిస్తున్నారట. ఈ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: King 100: ‘కింగ్ 100’లో టబు ఎంట్రీపై నాగార్జున క్లారిటీ!
‘కల్కి 2898 AD’ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో కలిసి దీపికా అదరగొట్టారు. అయితే సీక్వెల్‌లో దీపికా తప్పుకున్నారని మేకర్స్ వెల్లడించారు. వృత్తిపరమైన కారణాలతో ఆమె బయటకు వచ్చారు. ఇప్పుడు ‘సుమతి’ పాత్రకు సాయి పల్లవిని ఫైనల్ చేస్తున్నారని బలమైన రూమర్లు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి ఈ పాత్రకు సరిపోతుందని యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ‘రామాయణం’లో సీతగా నటిస్తున్న ఆమెకు ఇది మరో భారీ అవకాశం. ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది.
