Kaleshwaram: రాష్ట్రంలో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ విభాగం ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) నూనె శ్రీధర్ ఇంటి సహా పలు ఆస్తులపై తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) అధికారులు గురువారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. శ్రీధర్ వద్ద రూ.200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ACB ప్రాథమికంగా గుర్తించింది.
దాడుల ప్రాధాన్యత
హైదరాబాద్‌లోని మలక్‌పేట్, షేక్‌పేట్, టెల్లాపూర్‌తో పాటు వరంగల్, కరీంనగర్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో మొత్తం 12 చోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ACB అధికారులకు శ్రీధర్ అక్రమ సంపాదనపై పలు కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం.
స్వాధీనం చేసుకున్న ఆస్తులు:
హైదరాబాద్‌లో నాలుగు అంతస్తుల నివాస భవనం
షేక్‌పేట్‌లో 4,500 చదరపు అడుగుల విలాసవంతమైన ఫ్లాట్
టెల్లాపూర్‌లో విల్లా
వరంగల్‌లో G+3 భవనం
16 ఎకరాల వ్యవసాయ భూమి
19 ప్లాట్లు
రెండు కార్లు
భారీ మొత్తంలో బంగారం, నగలు, మరియు నగదు కొడుకు వివాహానికి థాయ్‌లాండ్ వేదికగా కోటిన్నర ఖర్చు చేసిన వివరాలు
హోటళ్లలో భాగస్వామ్యం
కేసు నమోదు – విచారణ కొనసాగుతోంది
నూనె శ్రీధర్‌పై అనధికారిక ఆదాయానికి మించిన ఆస్తుల కలుగు ఆరోపణలపై కేసు నమోదు చేసి ACB విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకుని ఆస్తుల వాస్తవ మూలాలపై విచారణ చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధం
నూనె శ్రీధర్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. గతంలో ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యతపై వచ్చిన ఆరోపణలపై ఈఈగా స్పందించిన వ్యక్తిగా శ్రీధర్ వ్యవహరించారు.