Jhanvi Kapoor: ‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీకపూర్. 2018లో ‘ధడక్’తో సినిమా రంగంలోకి వచ్చిన జాన్వీ ఖాతాలో తొలి కమర్షియల్ హిట్ అంటే ‘దేవర’నే. ఆరంభంలో టాలీవుడ్ ని చిన్న చూపు చూసిన ఈ చిన్నది ఇప్పుడు మాత్రం తన కెరీర్ మొత్తం టాలీవుడ్ పైనే ఆధారపడి ఉందని గ్రహించింది. అందుకే వరుసగా తెలుగు సినిమాలే కమిట్ అవుతోంది. ఎన్టీఆర్ తో ‘దేవర’ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా కమిట్ అయింది జాన్వీ కపూర్. అంతే కాదు ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమాపై కన్నేసింది. ఇటీవల ‘పుష్ప2’ చూసిన అమ్మడు పాజిటీవ్ రివ్యూ ఇవ్వడమే కాదు మూవీ చూస్తున్న పిక్స్ కూడా షేర్ చేసింది. ఆ పిక్స్ లో క్లీవేజ్ షోతో జాన్వీ కుర్రకారును కిర్రెక్కించేస్తోంది. ఫోకస్ మొత్తం టాలీవుడ్ కి షిప్ట్ చేసిన జాన్వీకపూర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే సినిమాలో హీరోయిన్ గా నటించవచ్చనే న్యూస్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే యూనిట్ నుంచి అమ్మడిని సంప్రదించారట. అధికారిక సమాచారం అయితే లేదు. దీని మీద క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Rajinikanth: రజనీ, ఆమీర్ అప్పుడు ప్లాఫ్… ఇప్పుడు!?
Rajinikanth: లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ చిత్రంలో పలువురు స్టార్స్ క్యామియో పాత్రలలో కనిపించబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ‘జైలర్’కి ఇది బాగా వర్కవుట్ అయింది. అదే ఫార్ములాను ఈ సినిమాకు అప్లై చేస్తున్నాడు లోకేశ్. అందులో భాగంగానే టాలీవుడ్ నుంచి నాగార్జునను మెయిన్ విలన్ గా కన్నడ, తమిళ, మలయాళ రంగాల నుంచి ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ సాహిర్ ని నటింప చేస్తున్న లోకేశ్ బాలీవుడ్ నుంచి ఆమీర్ ఖాన్ తో క్యామియో చేయిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జైపూర్ లో జరుగుతోంది. గతంలోనూ రజనీకాంత్, ఆమీర్ ఖాన్ కలసి ఓ సినిమాలో నటించారు. అదే ‘ఆటంక్ హై ఆటంక్’. ఆ సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది. ఈసారి మాత్రం కాంబో హిట్ అని నమ్ముతున్నాడు లోకేశ్ కనకరాజ్. లోకేశ్ తో తన తదుపరి చిత్రం చేయబోతున్నాడు ఆమీర్ ఖాన్. అందుకే రజనీ సినిమాలో క్యామియోని ఓకే చేశాడు. మరి గతంలో ప్లాప్ ఇచ్చిన రజనీ, ఆమీర్ ఈసారి హిట్ కొడతారేమో చూడాలి.