JC Prabhakar Reddy: తాడిపత్రిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారా.. శిక్ష అమలు చేయమంటారా అంటూ జేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో మీడియాతో మాట్లాడుతూ పదేపదే ఊరు బాగు కోసం ..మీకోసం చెప్తున్నాను అయినా కూడా మీరు అర్థం చేసుకోవడం లేదన్నారు. చెత్తను తీసుకువెళ్లేందుకు మనుషులు కూడా దొరకడం లేదన్నారు. చేతులు జోడించి అడుగుతున్న పరిశుభ్రంగా ఉంచుకొని అభివృద్ధి వైపు వెళ్దామని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నీరు, విద్యుత్, జరిమానా, మీ చెత్తను మీ ఇంట్లోనే వేయడం జరుగుతుందన్నారు. చివరగా ఒక మాట మీరు మారుతారా నన్ను ఊరు నుంచి వెళ్ళిపొమ్మంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.