Japaneese Baba Vanga: ఆమె కలగంటే అది నిజమై తీరుతుంది. సంవత్సరం, నెల, తేదీ, సమయం సహా జరిగే సంఘటన గురిచి ఆమెకు కలలో కళ్లారా చూస్తుంది. అది ఆమె డైరీలో నమోదు చేసుకుంటుది. అది కచ్చితంగా ఆమె చెప్పిన సమయాన నెవరేరి తీరుతుంది. ఇలా ఒక్కటి, రెండు కాదు.. చాలా వరకు ఆమె కలలు నిజాలై ప్రపంచాన్నే నివ్వెర పరుస్తున్నాయి. ఆమే జపాన్ బాబా వంగాగా పిలుచుకునే రియో తత్సుకి. ఆమె తనకు వచ్చే స్పష్టమైన కలల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె తాజాగా 2025 జూలైలో జరిగే సంఘటనపై ఆమెకు అప్పుడే కల వచ్చింది. 2020తోపాటు ఆ తర్వాత మళ్లీ కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని ముందుకంటే రెట్టింపు స్థాయిలో వణికిస్తుందని ఆమెకొచ్చిన కలలో ఆనాడే చెప్పింది. మరి ఆ కలలు నిజమవుతాయా? లేదా? అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్నది. వర్ధమాన భవిష్యవాణిగా పేరు పొందిన ఆమె గురించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
Japaneese Baba Vanga: జపాన్ దేశానికి చెందిన రియో తత్సుకి ఒకప్పుడు మాంగా కామిక్ చిత్రకారిణి. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమెకు వచ్చే స్పష్టమైన కలలు నిజమవుతుండటం వల్ల ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆశ్యర్యంగా ఆమె కలల్లో చాలా వరకు నిజమై తీరాయి. భవిష్యత్తును ముందే అంచనా వేయగల పేరుతో పాపులర్ అయిన వారి జాబితాలో రియో తత్సుకి కూడా చేరిపోయారు. అందరూ ఆమెను జపాన్ బాబా వంగా అని పిలుస్తున్నారు.
Japaneese Baba Vanga: 1980లో రియో తత్సుకి రాయడం మొదలుపెట్టిన తన కలల డైరీ (డ్రీమ్ జర్నల్)తో పాపులర్ అయింది. 1999లో ఈ కలల ఆధారంగా ‘ద ఫ్యూచర్ ఐ సా అనే మాంగాను ప్రచురించింది. ఇన్నేళ్లలో ఆమె ఎన్నో కలలను నమోదు చేసింది. అందులో చాలావరకు ప్రపంచంలో జరిగిన ఘటనలతో సరిపోలాయి. ఈ అసాధారణమైన కచ్చితత్వం వల్లే ఆమె తాజాగా చెప్పిన జోస్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Japaneese Baba Vanga: 1991లో రియోకు క్వీన్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యురీ గురించి కల వచ్చింది. కొద్ది నెలలకే ఫ్రెడ్డీ మరణించాడు. 1995లో ఆమెకు ఓ శక్తివంతమైన భూకంపం గురించి కల వచ్చింది. అది నిజంగానే కోబే భూకంపంగా మారి, 6,000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నది. ఆమె జోస్యాల్లో అందరినీ ఎక్కువగా ఆలోచింపజేసింది 2011 నాటిది.
Japaneese Baba Vanga: 2011 మార్చి నెలలో ఏదో భయంకరమైనది జరుగుతుందని ఆమె తన జర్నల్‌లో నోట్ చేసుకున్నది. అదే నెలలో జపాన్‌లోని తోహోకు వచ్చిన భూకంపం, సునామీ కుదిపేసింది. 1992 ఆగస్టు 31న ఆమె డైరీలో ‘డయానా? చనిపోయిందా? అని రాసి, ఓ మహిళ ముఖచిత్రాన్ని గీసింది. ఐదేళ్ల తర్వాత 1997 ఆగస్టు 31న యువరాణి డయానా ప్యారిస్‌లో కారు ప్రమాదంలో మరణించింది. 2020లో ఓ వింత వైరస్ వస్తుందని కూడా రియో తత్సుకి హెచ్చరించింది. అయితే పదేళ్ల తర్వాత మళ్లీ తిరిగొస్తుందని రియో తన నోట్‌లో రాసి ఉంచింది. ఈ అంశం కొవిడ్-19 వ్యాప్తికి, దాని ఉధృతికి సరిపోయింది. అంటే పదేళ్ల తర్వాత మళ్లీ వస్తుందంటే 2030లో కొవిడ్-19 మళ్లీ ప్రపంచాన్ని ఆవరిస్తుందా? అన్న అనుమానం కలగక మానదు.
Japaneese Baba Vanga: రియో తత్సుకి తాజా కల ఆసియా వాసులను తీవ్రంగా కలవరపెడుతున్నది. జపాన్‌కు దక్షిణంగా సముద్రం బుడగలు కక్కుతూ పైకి ఉబుకుతున్నట్లు, సముద్రం నుంచి భారీ గాలి బుడగలు వస్తున్నట్లు ఆమె కలలో చూసింది. ఇది సముద్ర గర్భంలో భారీ అగ్నిపర్వతం పేలుడుకు సంకేతమని, భయంకరమైన మెగా-సునామీని సృష్టించగలదని ఆమె నమ్ముతోంది. ఈ ఊహించిన విపత్తు జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా తీర ప్రాంతాలను తాకవచ్చని అంచనా.
Japaneese Baba Vanga: అంతేకాదు ప్రభావిత ప్రాంతం జపాన్, ఇండోనేషియా, తైవాన్, నార్తర్న్ మరియానా దీవులను కలుపుతూ డైమండ్ ఆకారంలో ఉన్నదని ఆమె వివరించింది. 2025 జూలై 5న ఈ భారీ ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుందని రియో తత్సుకి చెప్పింది. అయితే రాబోయే సునామీ గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే 2025 జూలై నెల రానే వచ్చింది. 5వ తేదీ రావడంతో పసిఫిక్ ప్రాంతంలో ఆమె హెచ్చరిక అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది.