IT Raids: సినీ ఇండస్ట్రీపై రెండో రోజైన బుధవారం కూడా ఐటీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు కూడా ఏకంగా 55 బృందాలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీల్లో పాల్గొంటున్నాయి. సినీ నిర్మాతలు, ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థల కార్యాలయాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతుండగా, గేమ్‌చేంజర్, పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాల కలెక్షన్లపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది.
IT Raids: ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో రెండు రోజులుగా ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమాల నిర్మాణానికి పెట్టిన బడ్జెట్‌పై వారు ఆరా తీస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపైనా అధికారులు కూపీ లాగుతున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండటంతోనే ఈ సోదాలు చేపడుతున్నట్టు సమాచారం.
IT Raids: గేమ్‌చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్ రాజు సతీమణి తేజస్వినితో అధికారులు నిన్న (మంగళవారం) బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయించారు. బుధవారం మరికొన్ని డాక్యమెంట్లను పరిశీలిస్తున్నారు. ఐటీ అధికారులు బుధవారం దిల్ రాజును తన ఎస్‌వీసీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం.
IT Raids: ఐటీ అధికారుల బృందాలు వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. తొలి రోజు కూడా 55 తొలి రోజు కూడా 55 బృందాలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఎఫ్‌డీసీ చైర్మన్ అయిన నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో, ఆయన కూతురు హన్సితారెడ్డి, సోదరుడు శిరీశ్ ఇండ్లల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ రోజు (బుధవారం) కూడా కొనసాగుతున్నాయి.
IT Raids: అదే విధంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు చెందిన మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు, కార్యాలయాలు, వారి భగస్వాముల ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 భారీ కలెక్షన్లకు సంబంధించిన జీఎస్టీ లెక్కలు, ఆదాయంలో బహిరంగ పర్చిన కలెక్షన్ చూపారా? లేదా? అనే విషయాలపై ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారని సమాచారం. సింగర్ సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.