RC 16:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘RC16’ గురించి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా వస్తున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్, బాగా ఎదురుచూస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే రోజున ఏదో ఒక స్పెషల్ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించి ఇప్పుడు టాక్ వచ్చేసింది. RC 16 టైటిల్, గ్లింప్స్ రెడీ అయిపోయాయి. ఏ.ఆర్. రెహమాన్ దానికి సూపర్ స్కోర్ ఇచ్చాడట. ‘పెద్ది’ అనే టైటిల్‌తో గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది, హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ అయిపోయి, ఇప్పుడు ఢిల్లీలో షూట్ చేయబోతున్నారు. ఇక ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పాలి.
