KCR: గరుడవేగ అంజి దర్శకత్వంలో ‘జబర్ దస్త్’ రాకేశ్ హీరోగా వస్తున్న ‘కెసిఆర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు సిద్ధిపేట ఎమ్మెల్లే హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అధికారంలో లేకున్నా కెసిఆర్ పై అభిమానంతో ఆయనపై సినిమా తీశారు రాకేశ్. ఇది కెసిఆర్ పై రాకేశ్ కి ఉన్న నిజమైన ప్రేమ, దమ్ము, ధైర్యానికి నిదర్శనం’ అని అన్నారు. కెసిఆర్ అంటే ఓ చరిత్ర అని, తెలంగాణ రాష్రాైనన్ని సాధించటమే కాదు పదేళ్ళ పాటు అభివృద్ది పథంలో నడిపించిన వ్యక్తి అని కొనియాడారు హరీశ్ రావు. అటువంటి కెసిఆర్ పోరాటాన్ని ఈ చిత్రం ద్వారా ప్రజలకు చూపించే ప్రయత్నం రాకేశ్ చేస్తున్నాడని అభినందించాడు.
KCR: ఈ వేడుకలో తెలంగాణ ఎమ్మెల్సీలు గోరెటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్ తో పాటు రోజా, చదలవాడ శ్రీనివాసరావు, జానీ మాస్టర్, శివబాలాజీ, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రఘు కుంచె, కాసర్ల శ్యామ్, చరణ్ అర్జున్ పాల్గొన్నారు. ఈ సినిమాలో నటంచటమే కాదు స్కీన్ ప్లే అందించి నిర్మించారు రాకేశ్. రాకేశ్ కి జతగా అనన్యకృష్ణన్ నటంచిన ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందించారు. తెలంగాణ సంస్కృతిని చాటే చిత్రమని అంటున్న రాకేశ్ కి 22న విడుదల కాబోతున్న ఈ సినిమా ద్వారా ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.