Iran:ఇరాన్‌పై సైనిక చర్య ఉండబోదని ఒకవైపు అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తుండగా, మరోవైపు పెద్ద ఎత్తున అమెరికా సైనిక దళాలు ఇరాన్ వైపు కదులుతున్నాయి. సముద్రం గుండా భారీ యుద్ధ నౌకలు, సైనిక దళాలు తరలి వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్‌పై దాడికి సిద్ధమయ్యామన్న ఇజ్రాయెల్ ప్రకటనతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Iran:ఇరాన్ వైపు పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు, భారీ సైనిక దళాలు వెళ్తున్నాయి. అక్కడ ఏం జరుగుతందో వేచి చూద్దాం.. అంటూ స్వయంగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం కూడా తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఇరాన్ కార్యకలాపాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే తగిన రీతిలో స్పందిస్తామనే ట్రంప్ పరోక్ష సంకేతాలు ఇవ్వడమూ ఆందోళన కలిగించే అంశమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Iran:ఇదే సమయంలో ట్రంప్ మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టారు. గతంలో ఇరాన్ దేశంలో సుమారు 837 మందిని ఆ దేశాధినేతలు ఉరితీయకుండా తాను దౌత్యపరమైన ఒత్తిడితో అడ్డుకోగలిగానని ఆయన స్వయంగా ప్రకటించడం కూడా కలకలం రేపింది. తన ప్రాబల్యంతో మానవ హక్కుల పరిరక్షణకు పాటుపడ్డానని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు యుద్ధ మేఘాలు కమ్ముకోవడంపై దౌర్జన్యం తప్పదనే విషయం తెలుస్తున్నది.
Iran:అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటనలు చూస్తుంటే ఇరాన్ నలువైపులా ఉచ్చు బిగుస్తుందనే తెలుస్తున్నది. చివరికి కమ్ముకున్న యుద్ధమేఘాలతో ఇరాన్ ప్రభుత్వాధినేత దిగివచ్చి అమెరికాకు పాదాక్రాంతం అవుతారా? లేక అమెరికా, ఇజ్రాయెల్ సైన్యంతో యుద్ధానికే దిగుతారా? అన్న విషయం ఒకటి రెండు రోజుల్లోనే తేలనున్నది. ఏదేమైనా ఇది వాంఛనీయం కాదని, శాంతి చర్చలతోనే సమస్యను పరిష్కరించాలని అత్యధిక ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి.
