Nagarjuna

Nagarjuna: నాగార్జున 100వ చిత్రంపై ఇంట్రెస్టింగ్ న్యూస్..?

Nagarjuna: టాలీవుడ్ లెజెండ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా వ్యవహరిస్తూ ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాల్లో కీలక పాత్రలతో మెప్పిస్తున్నారు. అయితే, ఈ రెండు సినిమాల తర్వాత ఆయన తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 100వ చిత్రంపై ఫోకస్‌ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం నాగ్‌ అభిమానులకు స్పెషల్‌ ట్రీట్‌గా రూపొందనుంది.

మొదట ఈ ప్రాజెక్ట్‌ను తమిళ దర్శకుడు నవీన్‌ తెరకెక్కిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, తాజా బజ్‌ ప్రకారం, మరో తమిళ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. నాగార్జున కెరీర్‌లో ఈ సినిమా ప్రతిష్ఠాత్మకంగా ఉండబోతోందని టాక్‌.

Also Read: Dil Raju: స్టార్ హీరోల సపోర్ట్‌తో ఆర్థిక ఆటుపోట్ల నుంచి బయటపడ్డ దిల్ రాజు!

Nagarjuna: ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఎగ్జైటింగ్‌ అప్డేట్‌ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న వెల్లడి కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే ఈ స్పెషల్‌ మూవీ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. నాగ్‌ 100వ సినిమా టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Thammudu: తమ్ముడు నుంచి రేపే ఫస్ట్ సింగిల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *