Chhaava

Chhaava: ‘ఛావా’ నుండి ఆసక్తికరమైన మోషన్ పోస్టర్

Chhaava: ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ జీవిత చరిత్ర ‘ఛావా’ పేరుతో వెండితెరపై ఆవిష్కృతం అవుతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాయికగా రశ్మిక మందణ్ణ నటిస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీ ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా జనం ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్ర కథానాయకుడు విక్కీ కౌశల్ పాత్రలోని వేరియేషన్స్ ను భూమి, నీరు, అగ్ని, గాలితో పోల్చుతూ ఓ మోషన్ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ మడాక్ ఫిలిమ్స్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ఎంతటి ఇంటెన్సిటీతో తెరకెక్కిందో ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్థమౌతోంది. దినేశ్‌ విజన్ నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించారు.

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kannappa: ‘కన్నప్ప’ లో పార్వతీగా కాజల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *