Inter exams:

Inter exams: ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో కీల‌క మార్పులు!

Inter exams: ఇంట‌ర్మీడియ‌ట్ ప‌బ్లిక్ ప‌రీక్షల్లో విద్యాశాఖ కీల‌క మార్పులను ప్ర‌తిపాదించింది. సీబీఎస్ఈ త‌ర‌హాలో రెండు కోర్సుల‌కు క‌లిపి ద్వితీయ సంవ‌త్స‌రం పూర్త‌య్యాకే ఒకేసారి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని కీల‌కంగా ప్ర‌తిపాద‌న చేసింది. ఈ మేర‌కు విద్యార్థులు తల్లిదండ్రుల అభిప్రాయాల సేక‌ర‌ణ‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.

Inter exams: ఈ నెల 26 వ‌ర‌కు విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను విద్యాశాఖ స్వీక‌రించ‌నున్న‌ది. సీబీఎస్ఈలో 11వ త‌ర‌గ‌తికి ప‌రీక్ష‌లు ఉండ‌వు. 12వ త‌ర‌గ‌తిలోనే ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఉంటాయి. అదే త‌ర‌హాలో ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే బాగుంటుంద‌ని భావించింది. ఏక‌ప‌క్షంగా ఈ నిర్ణ‌యం తీసుకోకుండా, ప్ర‌జాభిప్రాయానికి అనుగుణంగా పాల‌సీ తీసుకోవాల‌ని భావిస్తున్న‌ది.

Inter exams: ఈ అభిప్రాయాల ప్ర‌కారం.. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రంలో భారీ మార్పులు చేయాల‌నే యోచ‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఉన్న‌ది. భారీగా సిల‌బ‌స్‌ను కూడా త‌గ్గించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. దీంతో విద్యార్థుల‌కు ఒత్తిడి త‌గ్గి ఒకే ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త‌ను పెంచుకుంటార‌ని భావిస్తున్న‌ది. అదే విధంగా వ‌చ్చే ఏడాది నూత‌న మార్పుల్లో భాగంగా మార్చిలో ప‌రీక్ష‌లు పూర్త‌వ‌గా, ఏప్రిల్ 1 నుంచి 24 వ‌ర‌కు సెకండియ‌ర్ త‌ర‌గ‌తులు ప్రారంభిస్తారు. ఆ త‌ర్వాత వేస‌వి సెల‌వులు ఇస్తారు. తిరిగి జూన్ 1న కాలేజీల‌ను తెరుస్తారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *