India Pakistan War

India Pakistan War: అమృత్‌సర్‌లో పాక్‌ డ్రోన్ల కూల్చివేత.. వీడియో షేర్‌ చేసిన భారత ఆర్మీ

India Pakistan War: కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులపై ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మట్టుబడినట్లు భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్యతో పాక్‌కు గట్టిగా హెచ్చరిక ఇచ్చినట్టైంది భారత్.

ప్రతీకార దాడులకు పాల్పడిన పాక్‌

ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌ సైన్యం డ్రోన్లు, మిస్సైళ్ళు, యుద్ధవిమానాలతో భారత్‌పై విరుచుకుపడింది. గురువారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు పంజాబ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాల్పడింది. పాక్ దాడులకు భారత ఆర్మీ సమర్థవంతంగా ప్రతిస్పందిస్తూ, శత్రు కుట్రలను అడ్డుకుంటోంది.

ఖాసా కాంట్‌పై డ్రోన్‌ దాడిని తిప్పికొట్టిన భారత్‌

శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో, అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో పాక్ డ్రోన్‌లు చొరబడినట్లు గుర్తించిన భారత భద్రతా బలగాలు, వైమానిక రక్షణ వ్యవస్థ సహాయంతో వాటిని వెంటనే ధ్వంసం చేశాయి. ఈ ఘటనపై భారత ఆర్మీ ట్వీట్ చేస్తూ, “శత్రువు కుట్రలు ఆమోదయోగ్యం కావు, భారత సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే ప్రతి చర్యకు తగిన ప్రతిచర్య ఉంటుంది” అని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Revanth Reddy: జాతీయ రక్షణ నిధికి సీఎం నెల వేతనం విరాళం

శ్రీనగర్, చండీగఢ్, పఠాన్‌కోట్‌ లక్ష్యంగా దాడులు

పాక్ డ్రోన్‌లు శ్రీనగర్‌ విమానాశ్రయం, చండీగఢ్, పఠాన్‌కోట్‌ ప్రాంతాలపై కూడా దాడికి యత్నించాయి. భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించగా, భారత భద్రతా బలగాలు శీఘ్ర స్పందనతో దాడులను తిప్పికొట్టాయి. పాక్ దాడుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

రాజౌరి దాడిలో అధికారిక హతం

ఇక ఇటీవల రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకున్న పాక్ దాడుల్లో, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న ధీరనిర్ణయం మరింత మిన్నగా నిలిచింది.

ALSO READ  Mlc Kavitha: నీళ్లు కూడా తాగను.. ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *