India vs Australia: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 185 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం పోటీలో మొదటి రోజు. చివరి సెషన్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. క్రీజులో సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా ఉన్నారు. టీమ్ ఇండియా తరఫున రిషబ్ పంత్ అత్యధికంగా 40 పరుగులు చేశాడు. 26 పరుగుల వద్ద రవీంద్ర జడేజా ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 20 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 17 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ 2 వికెట్లు తీశాడు. నాథన్ లియాన్ ఖాతాలో ఒక వికెట్ చేరింది.
ఇది కూడా చదవండి: Vande Bharat Train: 180 కిలోమీటర్ల స్పీడుతో దూసుకుపోయిన వందేభారత్ స్లీపర్ ట్రైల్స్ సక్సెస్..
భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. అయితే గాయం కారణంగా ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. శుభ్‌మన్ గిల్ తిరిగి రాగా, ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం లభించింది.
ఈ వార్త కూడా చదవండి: వీరేంద్ర సెహ్వాగ్ నే ఆశ్చర్య పరిచిన 75 ఏళ్ల అమ్మమ్మ..
Isha Gramotsavam: భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం ఈశా గ్రామోత్సవం 16వ ఎడిషన్, కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఆదియోగి ఎదుట ఇటీవల అద్భుతంగా ముగిసింది. రెండు నెలల పాటు సాగిన ఈ క్రీడా మహోత్సవంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలోని గ్రామాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని గ్రామాల్లో నిర్వహించారు.
ముగింపు వేడుకలో సద్గురు మాట్లాడుతూ, ఈ ఉత్సవాన్ని మరింత విస్తృతం చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు. అంతేకాకుండా X వేదికగా “ఈశా గ్రామోత్సవం భారతదేశపు గ్రామీణ స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నం. చిన్న ఈవెంట్ గా మొదలై, నేడు ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి విస్తరించి, మొత్తం లక్షకు పైగా ఆటగాళ్లు, ప్రేక్షకులు, నిర్వాహకులు ఇందులో పాల్గొన్నారు. అయితే ఇది చాలదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇది జరగాలని మా ఆకాంక్ష.” అని వెల్లడించారు. మిగిలిన వార్త ఇక్కడ చదవండి: Isha Gramotsavam: వీరేంద్ర సెహ్వాగ్ నే ఆశ్చర్య పరిచిన 75 ఏళ్ల అమ్మమ్మ..