Champions Trophy 2025: టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించడానికి తిరస్కరించిన నేపథ్యంలో హైబ్రిడ్ హైబ్రిడహహబబ్రీడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడంపై అభిప్రాయం చెప్పాలని పీసీబీని ఐసీసీ కోరినట్లుగా తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌లో భారత్ మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించడానికి అంగీకరిస్తారా లేదా అని పీసీబీని ఐసీసీ అడిగినట్లు సమాచారం. హైబ్రిడ్ మోడల్‌లో జరిగినా ఆతిథ్య ఫీజును పూర్తిగా చెల్లిస్తామని ఐసీసీ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, పీసీబీ ఆతిథ్య హక్కులను వదులుకుంటే తప్ప.. భారత్ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలన్న ప్రణాళిక అలాగే ఉంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంటున్న నేపథ్యంలో ఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.